బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టు జాబితాలో ధోనీ పేరు లేదు!

  • ధోనీ కెరీర్ ముగిసినట్టేనన్న సంకేతాలు!
  • గతేడాది వరకు 'ఏ' గ్రేడ్ లో కొనసాగిన ధోనీ
  • ఈసారి ఏ విభాగంలోనూ లేని ధోనీ పేరు
వరల్డ్ కప్ తర్వాత టీమిండియా తరఫున ఆడని మహేంద్ర సింగ్ ధోనీకి జట్టు తలుపులు పూర్తిగా మూసుకుపోయినట్టేనా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. బీసీసీఐ తాజాగా ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్టుల జాబితాలో ధోనీ పేరు ఏ విభాగంలోనూ లేదు. ఏళ్ల తరబడి బోర్డు కాంట్రాక్టు జాబితాలో 'ఏ' కేటగిరీలో  కొనసాగిన ఈ వికెట్ కీపింగ్ దిగ్గజం కెరీర్ ముగిసిందనడానికి ఇది సంకేతం అనుకోవాలి!

ఇక, ఈసారి 'ఏ ప్లస్' గ్రేడ్ లో కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఉన్నారు. 'ఏ' గ్రేడ్ లో ధావన్, రాహుల్, రహానే, జడేజా, పంత్, అశ్విన్, పుజారా, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమి ఉన్నారు. 'బి' గ్రేడ్ లో మయాంక్ అగర్వాల్, హార్దిక్ పాండ్య, చాహల్, ఉమేశ్ యాదవ్, సాహా ఉండగా, 'సి' గ్రేడ్ లో శ్రేయాస్ అయ్యర్, హనుమ విహారి, కేదార్ జాదవ్, మనీష్ పాండే, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చహర్, నవదీప్ సైనీ ఉన్నారు.
Go Back to Shorts
BCCI
Contracts
MS Dhoni
Virat Kohli
India
Cricket

More Telugu News